*కామారెడ్డి జిల్లాలో ముమ్మరంగా ఓవర్ లోడ్ వాహనాల తనిఖీలు: మూడు వాహనాలు సీజ్…

*కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 21:(అఖండ భూమి న్యూస్);
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ దుర్గ ప్రమీల గార్ల మార్గదర్శకాల ప్రకారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓవర్‌లోడ్‌తో తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ ముమ్మర తనిఖీలు చేపట్టింది.
ఈ తనిఖీలలో భాగంగా కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి (డి టి ఓ) టి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి లోడ్‌తో వెళ్తున్న మూడు భారీ వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. క్వారీ నిర్వాహకులు, భారీ వాహనాల యజమానులు ఎవరూ కూడా వాహనాలలో ఓవర్‌లోడ్ రవాణా చేయకూడదని ఆయన హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎం వి ఐ) శంకర్ నారాయణ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏ ఎమ్ వి ఐ) రఫీ, కృష్ణ తేజ, రవాణా శాఖ కానిస్టేబుళ్లు మరియు హోంగార్డులు పాల్గొన్నారు.


