కాచాపూర్ లో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…

కాచాపూర్ లో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 22 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో శ్రీ గంగాదేవి దేవాలయం ప్రతిష్టాపర మహోత్సవం ఉత్సవాలు సోమవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం పోచమ్మకు బోనాలు తీశారు. సోమవారం యాగశాల ప్రవేశం, విగ్రహాల ఊరేగింపు, మంటప ప్రసాదం, 23న అగ్ని ప్రతిష్ట మూలమంత్ర అవణములు, సాయంత్రం విగ్రహాల ప్రతిష్టాపన, హారతి మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, 24న చండీ హోమం, విగ్రహాల మహన్నవనం, 25న యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, 26న బోనాల ఊరేగించుట, సాయంత్రం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఐదు రోజులు జరిగే విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలకు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి స్వామి, సాగర సంగం సభ్యులు లక్ష్మీనరసింలు, గౌట శంకర్, గంగాపుత్ర సుదర్శన సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!