25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 22 (అఖండ భూమి న్యూస్);
జూనియర్ కళాశాల మైదానం నుండి కలాభారతి వరకు ర్యాలీ ఉదయం 10.00 గంటలకు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని, ఈ నెల 25న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు
నశా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జూన్ 25న కామారెడ్డి పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సూచించారు.
జూనియర్ కళాశాల మైదానం నుండి కళాభారతి వరకు ఉదయం 10.00 గంటలకు నిర్వహించే ఈ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


