కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు… 
డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరికలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరో కీలక ముందడుగు పడింది. కామారెడ్డి టౌన్ ఎంఐఎం అధ్యక్షుడు *ఇమ్రోస్ హైమద్‌తో* పాటు పలువురు ముఖ్య నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి *గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశయాలను నెరవేర్చే పార్టీ అని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు వస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ *గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని, పార్టీలో చేరిన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధతను నమ్మి పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన మహమ్మద్ అబ్దుల్, మహమ్మద్ ఆమేద్, జమీల్, అలీ,
కామారెడ్డి పట్టణంలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ, రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కౌన్సిలర్లు, గడ్డమీది మహేష్, మాజీ కౌన్సిలర్లు,పిడుగు సాయిబాబా, జమీల్, సలీం, బల్ల శ్రీనివాస్, బండారి శ్రీకాంత్, రాహుల్, ఆకాష్, శశి, ఉన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…
కాచాపూర్ లో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…


