*_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 22 (అఖండ భూమి న్యూస్);
పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉన్నప్పటికీ రూ.2,000 జమ కాకపోతే ముందుగా కారణాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసం 1800-180-1551 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మీ వివరాలు అందిస్తే, చెల్లింపు ఎందుకు నిలిచిపోయిందో అధికారులు వివరిస్తారు. సాధారణంగా e-KYC పూర్తి కాకపోవడం, భూమి రికార్డుల ధృవీకరణ లేకపోవడం, బ్యాంక్ ఖాతా లేదా వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు ఉండటం వల్ల నిధులు ఆగిపోతాయి. అవసరమైతే సమీప CSCలో వివరాలు అప్‌డేట్ చేయించుకోవచ్చు. అలాగే CPGRAMS పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అర్హత ఉన్న రైతులు వివరాలు సరిచేసుకున్న తర్వాత బకాయి నిధులు ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంటుంది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


