కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
పెండింగ్ దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలి..
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి : ఆశిష్ సాంగ్వాన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 22 (అఖండ భూమి న్యూస్);
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, మొత్తం 125 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, పింఛన్లు, రెవెన్యూ తదితర అంశాలకు సంబంధించిన వినతులు ప్రజావాణిలో అందాయని ,
దూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రాకుండా ఆయా డివిజన్ పరిధిలో తమ అర్జీలను సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, NV గిరి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, zp CEO చందర్, DRO పాండు జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


