*ఎల్లారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు…
రైతులకు అవసరమైన ఎరువులు అందిస్తాం ఎమ్మెల్యే మదన్ మోహన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో యూరియా పంపిణీకి సంబంధించి కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడిన విషయం నా దృష్టికి వచ్చిందనీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పరిస్థితిని పర్యవేక్షించాననీ అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, నా కార్యాలయ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు అని తెలిపారు.
తాడ్వాయి మండలంలోని ఒక పిఎసిఎస్ ద్వారా యూరియా కొనుగోలు ప్రక్రియలో జరిగిన ఆలస్యం కారణంగా పంపిణీలో అంతరాయం ఏర్పడే పరిస్థితి వచ్చిందనీ అయితే అధికారులు వెంటనే అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకుని యూరియా లోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు అని అన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలించామనీ అన్నారు.
అవసరమైతే ప్రైవేట్ ఎరువుల దుకాణాల ద్వారా పంపిణీ చేసే అవకాశాలను కూడా పరిశీలించాము. అయితే ఆ విధానంలో అదనపు రవాణా, లేబర్ ఖర్చులు రైతులపై భారం పడే అవకాశం ఉండటంతో రైతులకు అదనపు వ్యయం లేకుండా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పిఎసిఎస్ పరిధిలో ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు కూడా వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా పిఎసిఎస్ పరిధిలోని గోదాముల ద్వారా యూరియా సరఫరాను మరింత సులభతరం చేసే అంశంపై కూడా అధికారులతో చర్చలు జరుగుతున్నాయి అని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు..
దేశవ్యాప్తంగా యూరియా సరఫరాపై ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు అవసరమైన యూరియా అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైన మేర యూరియాను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వ్యవసాయ శాఖ నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.
వ్యవసాయ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం కామారెడ్డి జిల్లాలో రైతులకు యూరియా సరఫరాలో గాంధారి మండలం మొదటి స్థానంలో ఉండగా, సదాశివనగర్ మండలం నాలుగో స్థానంలో ఉంది. ఈ రెండు మండలాలు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉండటం రైతులకు ఎరువులు అందించడంలో మేము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చెప్పడానికి నిదర్శనం అన్నారు.
యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌పై కొందరు అనవసర అపోహలు సృష్టిస్తున్నారు అని అన్నారు. రైతులకు నేరుగా, పారదర్శకంగా యూరియా అందించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశ్యం. రైతు పేరుతో బుకింగ్ అయితే రైతుకే యూరియా అందే విధంగా వ్యవస్థను రూపొందించారు అని గుర్తు చేశారు. దీనివల్ల అక్రమ మళ్లింపులు, మధ్యవర్తుల జోక్యం, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని అన్నారు.
కొత్త సాంకేతిక విధానాలకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందని ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ సేవలు కూడా కొత్తగానే అనిపించాయి అని అన్నారు. నేడు ప్రతి ఒక్కరూ వాటిని వినియోగిస్తున్నారు. అదే విధంగా రైతులు కూడా ఈ వ్యవస్థకు అలవాటు పడతారు. యాప్‌లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. రైతులకు మరింత సౌకర్యంగా సేవలు అందించేందుకు అవసరమైన మార్పులు కూడా రూపొందిస్తుందని అన్నారు.
రైతుల సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా పరిష్కార దృక్పథంతో చూడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాననీ తెలిపారు.రైతులకు సేవ చేయాల్సిన బాధ్యత అందరిదీ. రైతులను ఆందోళనకు గురిచేసే ప్రచారాల కంటే సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు జరగాలి అనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.
నేను ఎప్పుడూ రైతు పక్షానే నిలబడ్డాను. తాడ్వాయి మండలంలో రెండోసారి మొక్కజొన్న కొనుగోలు జరిగేలా కృషి చేశాను. జొన్నల కొనుగోలు కేంద్రాల కోసం పోరాడాను. ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించాను. ఎల్లారెడ్డి రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పైలట్ ప్రాజెక్టును తీసుకువచ్చి రీ-సర్వే జరిగేలా కృషి చేశాను. అసెంబ్లీలో కూడా అనేకసార్లు ఎల్లారెడ్డి రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాను అని అన్నారు.
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనే నమ్మకంతోనే నేను పనిచేస్తున్నాను. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్క రైతు కూడా యూరియా కోసం ఇబ్బంది పడకుండా చూడటం నా బాధ్యత. రైతులకు అవసరమైన యూరియా అందే వరకు నేను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తాను అని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు అని అవసరమైన ఎరువు తప్పకుండా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.


