ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…
యూరియా కొరతపై ఆందోళన అవసరం లేదు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
పాల్వంచ మండలం ఎలుపు గొండ లో యూరియా కేంద్రం పరిశీలన
రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన విత్తన మేళాను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న బీపీటీ-5204, డబ్ల్యూజీఎల్-44, ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా), కేఎన్‌ఎం-1638, కేఎన్‌ఎం-7715, హెచ్‌ఎంటీ, జై శ్రీరామ్ వరి రకాలను సాగు చేసి ప్రభుత్వ బోనస్‌ను పొందాలని సూచించారు.
యూరియా పంపిణీపై మాట్లాడుతూ, రైతులు యూరియాను ప్రత్యేక యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని తెలిపారు. యాప్‌లో బుక్ చేసిన అనంతరం రెండు రోజుల వరకు ఎరువుల బస్తాలను పొందే అవకాశం ఉంటుందని, రైతులు ఆందోళన చెందకుండా అవసరమైన సమయంలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
రైతులు ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు మట్టిలో తగిన తేమ (పదును) ఏర్పడిన తర్వాతే విత్తనాలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. తొందరపడి విత్తనాలు చల్లకుండా, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు మరియు స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్, అదనపు జిల్లా వ్యవసాయ అధికారి (ఏడీఏ) అపర్ణ పాల్గొన్నారు.
తహసీల్దార్ సరళాభాయి, ఎంపీడీవో గోపిబాబు, మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి రవి, ఎల్లంపేట గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.


