కామారెడ్డిలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 28 (అఖండ భూమి న్యూస్);
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా చూడాలని తెలిపారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలు, మొబైల్ బృందాల సేవలను సద్వినియోగం చేసుకొని అర్హులైన చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో dmho, మున్సిపల్ ఛైర్పర్శన్ ఉమారాణి,జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
You may also like
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ…
అంబారిపేట్ స్కూల్ లో ఘనంగా డాక్టర్ గునిగంటి. ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు…
దోమకొండ గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి , కలెక్టర్..
గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్ …


