దేమే కలాన్ లో రూ.20 కోట్లతో దేమే కలాన్ పిడబ్ల్యూఓ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
*మూడు మండలాల ప్రజల దశాబ్దాల కలను ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారం చేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం *దేమే కలాన్ గ్రామంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రెండు వరసల(టూవే) పీడబ్ల్యూడీ రహదారి నిర్మాణ పనులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు ఘన స్వాగతం పలికారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో దేమే గ్రామం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. గ్రామ ప్రజలు తమ చిరకాల కోరిక నెరవేరిందంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత *తాడ్వాయి, సదాశివనగర్, గాంధారి మండలాల వేలాది మంది ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుండగా, దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రయాణ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది అని తెలిపారు. మూడు మండలాలను అనుసంధానించే ఈ ద్విమార్గ రహదారి ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుంది అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, ముఖ్యంగా తాడ్వాయి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం,
తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం,
నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం,కొత్త రేషన్ కార్డుల మంజూరు,ప్రజలకు నాణ్యమైన *సన్న బియ్యం* పంపిణీ,
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడం,
వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. ఇప్పటికే అనేక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తై, గృహప్రవేశాలు కూడా జరుగుతుండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.
దేమే గ్రామంలో కూడా తన ప్రత్యేక చొరవతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చుతున్నామని మదన్ మోహన్ తెలిపారు. ప్రజల విశ్వాసమే తనకు బలమని, అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి… ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోవాలి… అదే మా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేమే గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు , భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
అనుమతులు లేని విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలి…
లడఖ్‌లోని కైగర్ రి పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థినిని సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ …
ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ…
ముత్యంపేటలో మద్యపాన నిషేధం…
హిందూ విద్యార్థులపై మతమార్పిడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి…


