పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు…

పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 30 (అఖండ భూమి న్యూస్);

పోలీసు శాఖలో మూడు దశాబ్దాలకు పైగా నిస్వార్థంగా, అంకితభావంతో ప్రజలకు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న అధికారుల సేవలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, కొనియాడారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందుతున్న అధికారులకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదవీ విరమణ పొందిన అధికారులను, వారి సతీమణులను శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ. ప్రజల రక్షణే ధ్యేయంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విధులు నిర్వర్తించడం పోలీసు వృత్తిలో అత్యంత గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఈ అధికారులు చేసిన కృషి పోలీసు శాఖకు గర్వకారణమని అన్నారు.

పదవీ విరమణ పొందిన అధికారులు: ఎం.డి. ఉస్మాన్ – ప్రస్తుతం సీసీఎస్, కామారెడ్డిలో ఎస్‌ఐగా 36 సంవత్సరాలు సేవలందించారు. శ్రీ దత్తాద్రి గౌడ్ – ప్రస్తుతం దేవన్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా 36 సంవత్సరాలు సేవలందించారు. కె. శంకర్ – ప్రస్తుతం బీర్కూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్‌ఐగా 35 సంవత్సరాలు సేవలందించారు. ఎస్.కె. అహ్మద్ – ప్రస్తుతం రాజంపేట్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా 35 సంవత్సరాలు సేవలందించి పదవీ విరమణ పొందారు.

ఈ నలుగురు అధికారులు కానిస్టేబుళ్లుగా తమ పోలీసు ప్రస్థానాన్ని ప్రారంభించి, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ శాఖకు విశిష్ట సేవలందించారని జిల్లా ఎస్పీ గారు ప్రశంసించారు. వారి సేవా స్ఫూర్తి, వృత్తిపట్ల నిబద్ధత, ప్రజాసేవ పట్ల అంకితభావం నేటి యువ పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని ఆన్నారు.

పదవీ విరమణ అనంతరం వారు కుటుంబ సభ్యులతో కలిసి సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో, ఆనందమయ జీవితాన్ని గడపాలని జిల్లా ఎస్పీ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

 

.

Akhand Bhoomi News

error: Content is protected !!