ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి…

ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి…

‘రహవీర్’ – పీఎం రహత్ పథకాలపై అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) సమీక్ష..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 30 (అఖండ భూమి న్యూస్);

రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రహవీర్ (రహ–వీర్)’ ‘పీఎం రహత్ (పీఎం భారత్)’ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) వి. విక్టర్ పథకాల అమలు తీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు స్పందించి బాధితులను సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

ప్రమాదం జరిగిన తొలి గంట (గోల్డెన్ అవర్)లోపు బాధితుడిని ఆసుపత్రికి చేర్చి ప్రాణాలను కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.25,000 నగదు బహుమతి అందజేస్తుందని తెలిపారు.

అలాగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు ఉచిత (క్యాష్‌లెస్) వైద్యం అందించే పీఎం రహత్ (PM RAHAT) పథకం అమలులో ఉందని పేర్కొన్నారు.

PM RAHAT పథకం

(Road Accident Victim Hospitalisation and Assured Treatment)

ముఖ్య ప్రయోజనాలు:

ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స.

ప్రమాదం జరిగిన తేదీ నుంచి 7 రోజుల వరకు ఉచిత వైద్యం.

గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వైద్య ఖర్చుల భారం ప్రభుత్వం భరిస్తుంది.

జాతీయ రహదారులు మాత్రమే కాకుండా, ఏ రహదారిపై జరిగిన ప్రమాదానికైనా ఈ పథకం వర్తిస్తుంది.

లబ్ధిదారులు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రతి బాధితుడు.

RAH-VEER పథకం (Good Samaritan Reward Scheme)

ముఖ్యాంశాలు:

ప్రమాద బాధితుడికి వెంటనే సహాయం చేసిన వారికి ప్రోత్సాహకంగా రూ.25,000 బహుమతి.

పోలీసులు లేదా కోర్టుల ఇబ్బందుల భయం అవసరం లేదు.

సహాయం చేసిన వారి హక్కులకు చట్టపరమైన రక్షణ ఉంటుంది.

ఒక వ్యక్తి సంవత్సరానికి గరిష్టంగా ఐదు సార్లు బహుమతి పొందే అవకాశం ఉంది.

లబ్ధిదారులు: ప్రమాద బాధితుడిని సకాలంలో ఆసుపత్రికి చేర్చిన సహాయకుడు.

అప్రిసియేషన్ కమిటీ సమావేశం

ఈ సందర్భంగా నిర్వహించిన అప్రిసియేషన్ కమిటీ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ)

వి. విక్టర్ అధ్యక్షత వహించారు.

సమావేశంలో జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్, జిల్లా రవాణా అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!