*కామారెడ్డి మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ గా మోటూరి శ్రీకాంత్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణానికి చెందిన 16 మంది బీజేపీ కౌన్సిలర్ లు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అద్యక్షతన నిర్వహించిన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా 39 వ వార్డు కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ ను ఏకగ్రీవంగా మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మోటురీ శ్రీకాంత్ మాట్లాడుతూ. తనకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా రెండవ సారి అవకాశం ఇచ్చిన గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారికి, తోటి కౌన్సిలర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు మున్సిపల్ లో ప్రజల పక్షాన , కామారెడ్డి పట్టణ అబివృద్ధి కి , సమస్యల పరిష్కారం కోసం గళం విప్పుతానని అన్నారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీ పటిష్టతకు తోటి కౌన్సిలర్ లతో కలిసి బూత్ స్థాయిలో పని చేస్తానని, పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఆయా కౌన్సిలర్లు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


