మాచారెడ్డి సింగిల్ విండోలో యూరియా బస్తాల గోల్డ్ మాల్..!
యూరియా గోల్ మాల్ పై ఒక ఉద్యోగి సస్పెన్షన్..
యూరియా గోల్ మాల్ జరిగిన రెండు రోజులకే ఐదు బస్తాలు విండోలోనే స్వాధీనం..
యూరియా గోల్మాల్ పై విండో పాలకవర్గం ఆగ్రహం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో సింగిల్ విండో లో చోటుచేసుకున్న యూరియా కుంభకోణం పై ఇటీవలే ఒక ఉద్యోగి సస్పెన్షన్ కాగా విండో లోనే మరో ఐదు బస్తాలు పట్టుబడి అందర్నీ ఆశ్చర్యంకు గురిచేసింది. ఇటీవల మాచారెడ్డి సింగిల్ విండో సహకార సంఘం లో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మాచారెడ్డి సింగిల్ విండో సహకార సంఘం లో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలపై యూరియా కొరకు రైతులు ఆందోళన చేయడంతో పాటు సిబ్బందిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీమంత్రి, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ సొంత గ్రామమైన మాచారెడ్డి సింగిల్ విండో సహకార సంఘంలో యూరియా కుంభకోణం చోటు చేసుకోవడంతో రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోమయంలో పడ్డారు. సొంత గ్రామంలో ఇలాంటి యూరియా కుంభకోణం జరగడంపై పాలకవర్గం సభ్యులు అయోమయంలో పడ్డారు. మాచారెడ్డి, ప్రస్తుత పాల్వంచ మండలాలూ కలిపి ఒకే ఒక్క సింగిల్ విండో సహకార సంఘం మాచారెడ్డి లోనే ఉండడం, జరుగుతున్న వరుస సంఘటనలపై అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. వ్యవసాయం చేసుకోవడానికి ఈ సీజన్ లో రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేయాల్సి ఉండగా 103 యూరియాల బస్తాలు ఆన్లైన్లో తేడాలు చూపించడంతో రైతులు జిల్లా వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఒక ఉద్యోగి సస్పెన్షన్కు గురైంది. సింగిల్ విండో కార్యాలయంలోనే ఐదు బస్తాలు యూరియా దాచి ఉంచడంతో వాటిపై పాలకవర్గం సభ్యులు వ్యవసాయ అధికారి పవన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరా తీయగా సస్పెన్షన్ అయినా ఉద్యోగి పద్మ , వ్యవసాయ అధికారి పవన్ ను వివరణ కోరగా, పొంతన లేని విషయాలు సమాధానం ఇచ్చారు. ఈ యూరియా కుంభకోణం పై అధికారుల, సిబ్బంది పాత్ర పై పాలకవర్గం సభ్యులు తీర్మానం చేసి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో పాలకవర్గం సభ్యులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
You may also like
ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం అత్యంత విలువైంది…
మాచాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్…
కామారెడ్డి మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ గా మోటూరి శ్రీకాంత్…
తెలంగాణ విశ్వవిద్యాలయ యు జి సి అఫైర్స్ డైరెక్టర్ గా డా.పాత నాగరాజు నియామకo…
గ్రామీణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…


