*తొలి బోనం కార్యక్రమంలో పాల్గొన్నా టి పి సి సి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 19 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన తొలి బోనం కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి *గడ్డం చంద్రశేఖర్ రెడ్డి* తన కుటుంబ సభ్యులు, కాలనీ వాసులతో కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా *గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. అమ్మవారి కటాక్షంతో రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, *కామారెడ్డి పట్టణ ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో జీవించాలని మనస్పూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు*.
ఈ కార్యక్రమంలో, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.


