*బహుజనుల బద్ద శత్రువులు కాంగ్రెస్ ,బిఆర్ఎస్, బిజెపి పార్టీలు…
బీఎస్పీ ఛీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 19 (అఖండ భూమి న్యూస్);
బహుజనుల బద్ద శత్రువు లు బిజెపి కాంగ్రెస్ బిఆర్ ఎస్ పార్టీ లు అని రానున్న ఎన్నికల్లో తెలంగాణ లో ఆ పార్టీ లని ఓడించాలని బీఎస్పీ ఛీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన జహీరాబాద్ పార్లమెంట్ సమావేశం కి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. రోడ్డు భవనాల అథితి గృహం లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ముందుగా బహుజన పితామహులైన మహాత్మా ఫూలే , బాబాసీహేబ్ అంబేడ్కర్ మాన్యవర్ కాన్షీరామ్ ల చిత్రపటాలకు పూల మాల వేసి నివాళులు అర్పించి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల (26న) ఇరవై ఆరు న కామారెడ్డి లో చత్రపతి సాహూజీ మహారాజ్ రిజర్వేషన్ల దివృనోత్సవ సభ కి వేలాది గా హజరు కావాలని యువత కు పిలుపునిచ్చారు. దేశంలో అధికారంలో ఉన్నా బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కూడ బహుజనుల వ్యతిరేక ప్రభుత్వాలే అని విమర్శించారు. ఇవి రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీలు అని అన్నారు. దేశంలో బిసిలు అన్ని రంగాలలో వెనుకబడి పోవడానికి కారణం కాంగ్రెస్ బిజెపి పార్టీ లే అని అన్నారు. నలబై మూడు ఏండ్లు బిసిలకు ఏ రంగంలో రిజర్వేషన్ లు అమలు కాక పోవడానికి కారణం కాంగ్రెస్ బిజెపి లే అని అన్నారు. బీఎస్పీ పోరాటం వలన మాన్యవర్ కాన్షీరామ్ గారి పోరాటం వలన వి పి సింగ్ ప్రభుత్వం దిగివచ్చి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ లు అమలు చేసిందని అన్నారు. బిజెపి రాజ్యాంగం రద్దు చేయాలని కుట్ర చేస్తుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం మళ్లి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని అన్నారు. రాజ్యాంగం రక్షణ కోసం ప్రజలందరు బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు బెహన్ జీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో తెలంగాణ లో బహుజన రాజ్యం ఏర్పాటు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జోన్ ఇంచార్జ్ గైని గంగాధర్, పార్లమెంట్ ఇంచార్జి ఉబ్బిత్ వార్ రోహిదాస్ జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గొల్ల సతీష్ ,
సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి CH. అశోక్,
EC మెంబర్ బాసిగే ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు మర్లు సాయి బాబు
నారాయణ ఖేడ్ అసెంబ్లీ అధ్యక్షులు తుకారాం,
ఉపాధ్యక్షులు కాషాయ్యా,
జిల్లా కార్యదర్శి పరుశరామ్,
అసెంబ్లీ ఇంచార్జి రాసిగొల్ల బాబు, ఎర్ర గోపాల్,
అసెంబ్లీ అధ్యక్షులు బంగారి జైపాల్, ఉపాధ్యక్షులు షేరే అశోక్, కార్యదర్శి G. లాలు, కోశాధికారి ఎర్రోళ్ల ప్రేమ్ కుమార్,
బేగరి గంగాధర్, గైని సాయిరాం,
బాన్స్ వాడ అసెంబ్లీ ఇంచార్జి లు
హిబ్రహీం,
అక్కం గారి శ్రవణ్ కుమార్,
అసెంబ్లీ అధ్యక్షులు అక్కం గారి జగన్,
ఉపాధ్యక్షులు ఆశగాళ్ల రవి,
ప్రధాన కార్యదర్శి గుప్తా సుధీర్,
కార్యదర్శి SD అహ్మద్, కోశాధికారి అక్కం గారి బాలరాజ్,
ఏడు అసెంబ్లీ ల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


