ఎరువుల డీలర్లకు కేంద్ర ప్రభుత్వ నూతన ఎరువుల విక్రయ విధానంపై అవగాహన శిక్షణ…
ఏడిఏ అపర్ణ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగ
స్టు 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి డివిజన్ పరిధిలోని ఎరువుల డీలర్లకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎరువుల విక్రయ( ఫ్రేమ్‌వర్క్ ఫర్టిలైజర్ సెల్) అమలుపై అవగాహన కల్పించేందుకు శనివారం కామారెడ్డి ఎ డి ఎ అపర్ణ ఆధ్వర్యంలో దోమకొండ రైతు వేదిక లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన యాప్ లోని ముఖ్యాంశాలు, ఎరువుల విక్రయంలో పాటించాల్సిన నిబంధనలు, రైతులకు పారదర్శకంగా , సమర్థవంతంగా ఎరువులు అందించే విధానం, యాప్ ద్వారా ఎరువులు బుకింగ్ చేసుకునే విధానం తదితర అంశాలపై అధికారులు డీలర్లకు అవగాహన కల్పించారు. రైతు గుర్తింపు నంబర్ పొందిన ప్రతి రైతు యొక్క వివరాలు యాప్ లో పొందుపరచడం జరిగిందని అన్నారు. రైతు తమ ఆధార్ నంబర్ , ఓటీపీ ఆధారంగా యాప్ లో లాగిన్ అవ్వగానే రైతు యొక్క సర్వే నంబర్, భూమి విస్తీర్ణం పూర్తి వివరాలు యాప్ లో కనిపిస్తుందని అన్నారు. రైతు తాము సాగు చేసే పంట వివరాలు నమోదు చేసుకొని ఈ యాప్ ద్వారా యూరియా, డి ఎ పి, పొటాష్ , కాంప్లెక్స్ ఎరువులు తమకు అందుబాటులో ఉన్న సొసైటీ లేదా డీలర్ వద్ద కొనుగోలు చేసుకోవచ్చు అన్నారు. రైతు గుర్తింపు నంబర్ పొందని వారు ఆధార్ నంబర్ , ఫోన్ నెంబర్ ఆధారంగా ఎరువులను కొనుగోలు చేసుకోవచ్చు అన్నారు.
ఎరువుల విక్రయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రతి డీలర్ తప్పనిసరిగా పాటించాలని, రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకతను పాటించాలని అధికారులు సూచించారు. కొత్త విధానం అమలుతో ఎరువుల పంపిణీ మరింత సమర్థవంతంగా జరిగి, రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు ఆగస్టు 6 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ కొత్త విధానంపై రైతులకు ఎఈఓ లు అవగాహన కల్పించాలని సిబ్బందికి తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ పరిధిలోని మండల వ్యవసాయ శాఖ అధికారులు , డీలర్లు పాల్గొన్నారు.
You may also like
ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ కార్యకర్తల కృషి అభినందనీయం…
పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు కి సన్మానం..
బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు…
ఆగస్ట్ 10న నిర్వహించే “జైల్ భరో” కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…
జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ అంశాలపై సమీక్ష…


