జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ అంశాలపై సమీక్ష…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్);
సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్.
జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ పథకాల అమలు, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ జిల్లా ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన ఐడీఓసీలోని కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి వివిధ శాఖల జిల్లా అధికారులు, కామారెడ్డి జిల్లా దివ్యాంగుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, మైనారిటీ, బీసీ, గిరిజన సంక్షేమ విద్యాసంస్థలకు ఆవిరితో ఉడికించిన బియ్యం (స్టీమ్ రైస్) సరఫరా, విద్యాసంస్థలకు గ్యాస్ సిలిండర్ల సరఫరా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం దివ్యాంగులకు కొత్త చౌక ధరల దుకాణాల ఏర్పాటు, ఈ-కేవైసీ నమోదులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ, దీపం పథకం ప్రయోజనాల బదిలీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను మానవీయ దృక్పథంతో పరిశీలించి, వారికి అవసరమైన సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ-కేవైసీ నమోదులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి నిత్యావసర సరుకులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హాస్టళ్లు, ప్రభుత్వ విద్యాసంస్థలకు నాణ్యమైన ఆవిరితో ఉడికించిన బియ్యం, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం దివ్యాంగులకు చౌక ధరల దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిబంధనల మేరకు వేగవంతం చేయాలని తెలిపారు.
జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు సమావేశంలో ప్రస్తావించిన ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిగణించి, సంబంధిత శాఖలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమానికి. సంబంధించిన ప్రతి అంశంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్ వై గిరి, ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ, డి ఎం. శ్రీకాంత్, రవీందర్ ,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
You may also like
ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ కార్యకర్తల కృషి అభినందనీయం…
పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు కి సన్మానం..
బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు…
ఆగస్ట్ 10న నిర్వహించే “జైల్ భరో” కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


