ఆగస్ట్ 10న నిర్వహించే “జైల్ భరో” కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…
సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ పిలుపు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్);
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై , బిజేపి అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు), అఖిల భారత కిసాన్ సభ (ఏఐ కె ఎస్), అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ల పిలుపు మేరకు 2026 ఆగస్టు 10న నిర్వహించనున్న దేశ వ్యాప్త “జైల్ భరో” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మూడు సంఘాల జిల్లా కమిటీ సమావేశం జరిగింది
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల అమలుకు నోటిఫై చేస్తూ, కార్మికులు సుదీర్ఘ పోరాటాలతో సాధించుకున్న హక్కులను కాలరాసిందని,రోజువారీ పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచడం, ‘హైర్ & ఫైర్’ విధానాలు తీసుకురావడం, కనీస వేతనాలు, సామాజిక భద్రతను పక్కనబెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు. 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీయ వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోయి రైతులు దివాళా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా పంటల వ్యయంపై 50 శాతం కలిపి మద్దతు ధరలు ఇవ్వాలని, రుణవిమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని బడ్జెట్‌ను తగ్గించే కుట్రలను అడ్డుకోవాలని సూచించారు. వి బి జి రామ్ జి పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ సవరణ బిల్లు-2025ను ఉపసంహరించుకోవాలని, ఉచిత విద్యుత్ రద్దు కుట్రలను నిలిపివేయాలని, అలాగే ఆహార భద్రతా చట్టంలో పేదలకు నాణ్యమైన బియ్యం కోత విధింపు చర్యలను విరమించుకోవాలని స్పష్టం చేశారు.
దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తితో, కార్పొరేట్ పెట్టుబడిదారులు మరియు మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఏకమై పోరాడాలని ఆయన కోరారు. ఆగస్టు 10న జరిగే జైల్ భరో ఆందోళనల్లో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు మోతి రామ్ నాయక్ వెంకట్ గౌడ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు అధ్యక్షులు వెంకటి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోహన్ దశరథ్ కార్మిక సంఘం నాయకులు అరుణ్, రాజనర్సు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ రేణుక తదితరులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


