బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని, ఈ విషయంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంత మంది చేతి వాటం చూయించారని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కలిసి పిర్యాదు చేయటం జరిగిందనీ బిజెపి కౌన్సిలర్లు లు శనివారం తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ. కామారెడ్డి పట్టణంలో నూతన పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 5,92,91,364 ఖర్చు కాగా అందులో 75 బిల్లులు 1,13,14566 రూపాయల చెల్లింపు విషయంలో, అంతే కాకుండా ఎస్ డి ఆర్ ఎఫ్ సంబంధించిన 71,28,937 రూపాయలు ఖర్చు కా అందులో 5 బిల్లులకు గాను 59,86,353 రూపాయలు చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా అనుమానం ఉందని వీటి విషయంలో సరియైన విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై, వాటి వెనక ఉన్న ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని ఫిర్యాదు చేశారు, ఈ విషయంలో సరియైన స్పందన రాకపోతే విజిలెన్స్ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి పిర్యాదు చేస్తామని అన్నారు.
You may also like
ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ కార్యకర్తల కృషి అభినందనీయం…
పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు కి సన్మానం..
ఆగస్ట్ 10న నిర్వహించే “జైల్ భరో” కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…
జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ అంశాలపై సమీక్ష…
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


