ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ కార్యకర్తల కృషి అభినందనీయం…
ఎస్ ఐ ఆర్ ప్రక్రియ విజయవంతం..
– మహమ్మద్ ఇలియాస్ అలీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ నాయకత్వంలో, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడం కార్యకర్తలను శనివారం అభినందించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే పునాది. ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా ఇంటింటికీ వెళ్లి ఎంతో బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేసి ఎస్ ఐ ఆర్ ప్రక్రియను దాదాపు 100 శాతం విజయవంతం చేసిన అన్ని బి ఎల్ ఓలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు,, బూత్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభినందనలు
తెలిపారు.
ఈ విజయానికి మార్గదర్శకులైన మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఏలే మల్లికార్జున్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తోందనీ అన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి , రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్ అలీ , జిల్లా కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, చైర్మన్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బి ఎల్ ఓ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
You may also like
పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు కి సన్మానం..
బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు…
ఆగస్ట్ 10న నిర్వహించే “జైల్ భరో” కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…
జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ అంశాలపై సమీక్ష…
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


