యువతను ప్రోత్సహించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది

అల్లూరి జిల్లా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి వేణుగోపాలరావు
అల్లూరి జిల్లా అనంతగిరి ( అఖండ భూమి)అనంతగిరిలో సూర్యవాణి క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డి.ఎస్.పి
అనంతగిరి ; మన్యంలో యువత చెడు వ్యసనాలకు ,అసాంఘిక కార్యకలాపాలకు బానిస కాకుండా ఉండేందుకుగాను పోలీస్ శాఖ వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపడుతుందని అల్లూరి జిల్లా స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి వేణుగోపాలరావు అన్నారు. రాయల్ రిసార్ట్ ఆవరణలో నూతన సూర్యవాణి క్రికెట్ కల్చరల్ అకాడమీ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. క్రీడల్లో రాణించి మండలానికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ తునీహ్ సిన్హా ఆధ్వర్యంలో యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందని అన్నారు. పోలీస్ శాఖ ద్వారా ఎస్పి సిన్హా ఆధ్వర్యంలో తమ వంతు సహకారాన్ని అకాడమీకి అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ శెట్టి నీలవేణి అకాడమీ సభ్యులను ప్రోత్సహిస్తూ ఐదువేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. క్రీడల్లో రాణించాలని అకాడమీ నెలకొల్పడం చాలా ఆనందదాయకమని ఆమె అన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నైపుణ్యత పెంచుకొని ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర దేశీయ క్రీడల్లో అవకాశం సంపాదించుకోవాలని సూచించారు. అకాడమీ పటిష్టపరిచేందుకు అధికారుల తరఫున అందాల్సిన ప్రోత్సాహాన్ని తమ ద్వారా అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని జడ్పిటిసి దీసరి గంగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులకు టీ షర్ట్ లను పంపిణీ చేశారు. అతిథిలకు అకాడమీ ప్రతినిధులు దుశ్శాలువాతో సత్కరించి మెమంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోమెల రూతు, నాగులు, అకాడమీ అధ్యక్షులు కమిడి రాజ్ కుమార్, ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కమిటీ బృందం సత్యా, రఘు ,స్వామి ,చందు పిడి రాజు తదితరులు పాల్గొన్నారు.


