ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గడపగడపకు మన ప్రభుత్వ
– ఎమ్మెల్యే పెట్ల గణేష్
నాతవరం మండలం సుందరకోట పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలికారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ పాల్గొన్నారు ఇంటింటికీ వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని అర్హత ఉన్న ప్రతీ ఒక్కరు లబ్ధి పొందాలని అధికారులకు సూచించారు అందులో భాగంగా ప్రజలు సుందర కోట నుంచి తొరడ బమ్మిలకొద్దు వరకు సుమారు రెండు కిలోమీటర్ల రోడ్డు కావాలని ఆయనను కోరగా వెంటనే ఆయన స్పందించి ఉపాధి హామీ పథకం ద్వారా ఇరవై లక్షలు ప్రతిపాదన చేయమని అధికారులకు ఆదేశించారు సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలని ప్రజా శ్రేయస్సే మాకు ముఖ్యమని ఎమ్మెల్యే గణేష్ అన్నారు ఈ కార్యక్రమంలో నాతవరం మండల పరిషత్ అధ్యక్షులు సాగిన లక్ష్మణ మూర్తి ఉపాధ్యక్షులు సునీల్ మండల వైఎస్ఆర్ సీపీ సేవాదల్ అధ్యక్షులు గవిరెడ్డి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు



