మహానాడు ను మాయనాడుగా మార్చేశారు

మహానాడు ను మాయనాడుగా మార్చేశారు

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కొయ్యూరులో భారీ బైక్ ర్యాలీ

పాడేరు ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి

కొయ్యూరు అఖండ భూమి మే 29 అల్లూరు జిల్లా వెబ్ న్యూస్

ప్రతిష్టాత్మక రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ను మాయనాడుగా మార్చేసారని శాసనసభ్యురాలు కే భాగ్యలక్ష్మి అన్నారు పేదలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కొయ్యూరు లోని సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు కాకరపాడు నుండి ఉయ్యూరు జంక్షన్ వరకు నిర్వహించిన ఈ నిరసన ర్యాలీకి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా పాడేరు శాసనసభ్యురాలు కే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో రెండు రోజులు పాటు జరిగినటువంటి మహానాడు పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆమె అన్నారు మహానాడు అంటే ఎన్టీఆర్ మాత్రమే గుర్తొస్తారని ఆయన పెట్టినటువంటి పార్టీ అన్యాయంగా అష్టగసం చేసుకొని ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు మహానాడులో మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మాయగాడిగా మార్చేస్తున్నారని ఆమె అన్నారు మహానాడులో టిడిపి తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఉపయోగపడని ఆమె తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన వారి సంక్షేమ కోసం నిరంతరం పాలన అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు ప్రతి కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పేరిట చేయూతని ఇస్తుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు ఇంత చక్కటి పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు తేలుతున్నారని ప్రజలను మోసం చేస్తున్నారని దుష్ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నారని హామీ సందర్భంగా విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరిని ధనవంతులను చేస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని పేదోళ్లను ధనికులుగా మార్చారు చెప్పాలని ఆమె నిలదీశారు ఇప్పటివరకు ఏ ఒక్క పేద వారిని ఆదుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పేదవారిని ఎలా ధనికుల చేస్తారో తెలియజేయాలని ఆమీ డిమాండ్ చేశారు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడి పక్షాన నిలబడి వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయాన్ని పునరుఘట్టించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బడుగు రమేష్ జెడ్పీటీసీ వార నూకరాజు ఏఎంసీ చైర్మన్ వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ అంబటి నూకాలమ్మ బీసీ డైరెక్టర్ గాడి నాగమణి వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ బండి సుధాకర్ సర్పంచులు అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు గ్రీవెన్స్ అధ్యక్షులు మహేష్ జిల్లా ప్రసాద కార్యదర్శి ధోని బాబ్జి డైరెక్టర్ సుమర్ల సరస్వతి యూత్ అధ్యక్షులు చెడ్డ సావిత్రి సర్పంచులు ఎంపీటీసీలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!