ములుగు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన
జిల్లా ఎస్పీ గౌష్ ఆలం.
ములుగు జిల్లా ,అఖండ భూమి ప్రతినిధి ,మే 29.
ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో వివిధ విభాగాల వారీగా రికార్డ్స్ ను జిల్లా ఎస్పీ సోమవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఎస్పీ ని సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు. తనిఖీ లో భాగంగా ఎస్పీ అన్ని రికార్డ్స్ పర్యవేక్షించారు. సిఐ విసిటర్స్ రికార్డు (సీఐ ని వివిధ సమస్యలతో సందర్శించిన వారి సంఖ్య వాటి పరిష్కారం), క్రైమ్ డైజెస్ట్ రికార్డ్స్ సీఐ ఆఫీస్ లోని ప్రభుత్వ ఆస్తి జిల్లాలో ఆయుధ లైసెన్స్ కలిగి ఉన్న వారి జాబితా రిజిస్టర్డ్ కేసుల సంఖ్య వాటి స్థితిగతులు పరిశీలించారు.రికార్డ్స్ పరిశీలన అనంతరం సీఐ తో ఎస్పి మాట్లాడుతూ క్రింది స్థాయి ఉద్యోగుల యొక్క పర్యవేక్షణ ఇంకా మెరుగ్గా చూడాలని సూచించారు. అదేవిధంగా రికార్డ్ మెయింటెనెన్స్ మెరుగుపరుచుకోవాలని అండర్ ట్రయల్ కేసుల వివరాలు సరిగా నమోదు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పి నలువాల రవీందర్, సిఐ ములుగు రంజిత్ కుమార్, ఎస్ఐ పవన్ కుమార్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



