అసమర్ధత పాలన, రైతుల అరిగోషా పెడుతున్న బీఆర్ఎస్ పాలన :మండల అధ్యక్షులు చిటమట రఘు.

 

అసమర్ధత పాలన, రైతుల అరిగోషా పెడుతున్న బీఆర్ఎస్ పాలన :మండల అధ్యక్షులు చిటమట రఘు.

ములుగు జిల్లా, అఖండ భూమి రెడ్ న్యూస్ :

ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఐకెపి ,పిఏసీఎస్ ,జిసిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది .ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సెంటర్లకు చేరి నెల రోజులు దాటినప్పటికీ లారీల కొరతతో, వడ్లు కొనుగోలు కేంద్రాలలో కుప్పలుగా వడ్లు గొనె సంచుల్లో వడ్లు నింపి నెలల తరబడి పడిగాపులు కాస్తున్నా రైతన్నలు, లారీల కొరతతో ఇబ్బందులు ఈదురు గాలులతో ,వర్షాలతో పశువులతో కంటిమీద కునుక్కు లేకుండా పండించిన పంటకు కాపల వర్షాకాలం ,జూన్ నెలలో మొదలుకాస్తున్న వడ్లు మాత్రం వడ్ల కళ్ళల్లో ఉంటున్నాయి,బిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే లారీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు . వివిధ కారణాలతో ధాన్యం కొనుగోలు లేట్ అవుతుండటంతో రైతులు ధాన్యం కుప్పల కాడనే రాత్రుళ్లు పడుకోవాల్సి వస్తోంది. వర్షాలు పడుతుందేమో అని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులు మారిపోవడంతో వారం రోజులుగా మబ్బులు పడుతున్నాయి. చాలా చోట్ల వర్షాలు పడటంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఎంత ఎండబోసినా ధాన్యంలో తేమ శాతం తగ్గటం లేదు.దీన్ని కారణంగా చూపి సొసైటీ వారు ధాన్యం కొంట లేరు.దీంతో కొంత మంది రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది.లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగుబడి అయింది.ఎవరూ పట్టించుకుంటలేరు.మద్దతు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం నిర్వహణ విషయంలో చేతులెత్తేసింది. నిర్దేశిత మాయిశ్చర్17 శాతం రావాలి. కానీ ఎండలు ఎక్కువగా ఉండడంతో 12శాతం వస్తుందని, తూర్పార పట్టినా తరుగు తీసిండ్రు.పోయినేడు తూర్పార పట్టిన ధాన్యాన్ని మిల్లులకు పంపించినా మిల్లర్లు కచ్చితంగా ప్రతి సంచికి 3 నుంచి 5 కేజీలు తరుగు కింద కోత పెట్టారని రైతులు చెబుతున్నారు. కొన్ని కేంద్రాల్లో రైసు మిల్లర్లతో నిర్వాహకులు కుమ్మక్కై తూర్పారా పట్టని ధాన్యాన్ని 3 కేజీల కోతతో తీసుకుంటున్నారు. అదే ధాన్యాన్ని మిల్లుకు పంపగానే అక్కడ మిల్లర్లు మరో 5 కేజీలు తరుగు కింద కోత పెడుతున్నారు.రైతుల అమాయకత్వాన్ని మిల్లర్లు, అధికారులు, సెంటర్ నిర్వాహకులు దోచుకుంటున్నారు. ఒకవైపు అధికారులు ఎక్కడైనా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు, మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.కానీ ఫిర్యాదు చేసినా ఎక్కడా చర్యలు తీసుకోలేదు.ధాన్యం పోసి నెల రోజులైంది. మాయిశ్చర్ రాలేదని కొనుగోలు సెంటర్లు స్టార్ట్ చేయలేదు. ఓ వైపు వర్షాల పడుతున్నాయి. వెంటనే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్,పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు,ఎంపీటీసీ గుడ్ల శ్రీలత-దేవేందర్ , జిల్లా మైనారిటీ సీనియర్ నాయకులు ఖలీల్ ఖాన్,బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,మహిళా మండల అధ్యక్షురాలు,ఉపసర్పంచ్ కర్ల అరుణ, అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య ,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సోదారి రామయ్య,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డోంగిరి మధుబాబు, ఎండీ లాల్ మహ్మద్,మండల మాజీ మహిళా అధ్యక్షురాలు కటుకూరి రాధికా,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం,మండల ఉపాధ్యక్షులు ఎండి రియాజ్ మహిళా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!