కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో పోలీస్ స్టేషన్ ఆవరణ నందు వెలసిన నాగులకు నాగ ప్రతిష్ట పున ప్రారంభం కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గత మూడు రోజుల నుండి వెల్దుర్తి సీఐ యుగంధర్ సతీమణితో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రతిష్ట కార్యక్రమం ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ సిబ్బంది అహర్నిశలు కృషితో మీడియా మిత్రులతో ఏకమై కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం చివరి రోజు కావడంతో గ్రామ పెద్దలు బొమ్మన శివశంకర్ రెడ్డి హాజరై నాగులను దర్శించుకున్నారు. అదేవిధంగా వెల్దుర్తి పట్టణంలోని ప్రముఖులు భక్తాదులు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై మొక్కలు తీర్చుకొని పునితులయ్యారు. ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన భక్తులకు అల్పాహార విందు భోజన కార్యక్రమాలు నిర్వహించి అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వెల్దుర్తి పట్టణ పెద్దలకు ప్రజలకు భక్తులకు సీఐ యుగంధర్ కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…

