దావనపల్లి రైతు భరోసా కేంద్రం లో గిరి రైతులకు విత్తనాల పంపిణీ సర్పంచ్ రామకృష్ణ 

 

 

దావనపల్లి రైతు భరోసా కేంద్రం లో గిరి రైతులకు విత్తనాల పంపిణీ సర్పంచ్ రామకృష్ణ

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ సచివాలయం పరిధిలోగల ఆర్బికే కేంద్రంలో సబ్సిడీ ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ కుందిరి రామకృష్ణ మాట్లాడుతూ90% రాయితీతో రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆర్ జెల్. 10 11 వెరైటీలు అందుబాటులో ఉన్నాయని. త్వరలో వేరుశనగ రైతులకు అవసరమైన వెరైటీలను అందుబాటులోకి తెస్తామని సర్పంచ్ అన్నారు. కాబట్టి సబ్సిడీ ద్వారా ఇస్తున్నటువంటి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అలాగే రైతులకు పంటలకు అవసరమైన సలహాలు సూచనలు ఆర్బిక కేంద్రానికి వచ్చితెలుసుకోవాలని సూచించారు. జగనన్న ప్రభుత్వం వచ్చి నుంచి రైతులకు రైతు భరోసా ఇవ్వటంతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ సబ్సిడీ రుణాలతో పాటు ఆర్బికే కేంద్రాల ద్వారా పంటలకు అవసరమైన సలహాలు సూచనలు. పంట పాడవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా నియమించడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సేవలను కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ జోసెఫ్ రైతులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!