పేరుకే 30 పడకలు… పత్తాలేని డాక్టర్లు

 

 

పేరుకే 30 పడకలు..

డాక్టర్లు లేక ఇబ్బంది పడుతున్న వైనం…

కిందిస్థాయి ఉద్యోగులే శరణ్యం..

వెల్దుర్తి మే 31 (అఖండ భూమి) : పేరుకే 30 పడకలు ఆస్పత్రి. పత్తాలేని డాక్టర్లు, డాక్టర్లు లేకపోవడంతో ప్రథమ చికిత్స చేయించుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న తీరు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రమైన పట్టణంలో చోటుచేసుకుంది. కోట్లు వెచ్చించి ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు నూతన వైద్యశాలను నిర్మించారు. షిఫ్ట్ డాక్టర్లు లేకపోవడంతో రాత్రి వైద్య సేవలు నిలిచిపోయాయి. కిందిస్థాయి ఉద్యోగులు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. దీంతో ఇక్కడికి వచ్చిన పేషెంట్లు చేసేది ఏమీ లేక కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలి వెళ్తున్నారు. వెల్దుర్తి 30 పడకల ఆసుపత్రి నందు అన్ని వసతులు ఉన్నప్పటికీ డాక్టర్లు మాత్రం ఇక్కడ ఉండకపోవడం విశేషం. మార్నింగ్ డ్యూటీ అధికారులు ఒంటి గంటకే వెళ్తున్నారు. ఉదయం డాక్టర్లు సాయంత్రం నాలుగు గంటల వరకి ఉండాలి. సిస్టర్లు రెండు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహించాలి. దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ స్థానికంగా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సబవని పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకొని రాత్రి వేళలో డాక్టర్లు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మండల పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!