మలేరియా నివారణ మాసోత్సవాలు పురస్కరించుకొని అవగాహన ర్యాలీ

 

ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామ సచివాలయాల్లో మలేరియా నివారణ మాసోత్సవాలు పురస్కరించుకొని జిల్లా మలేరియా అధికారి కె.వరహాలు దొర ఆదేశాల మేరకు అవగాహన ర్యాలీలు, శిబిరాలు నిర్వహించామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్. వాసంతి తెలిపారు .ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కీటక జనిత వ్యాధులయిన మలేరియా డెంగీ  చికెన్ గున్యా  ఫైలేరియా మెదడు వాపు జ్వరాలు బారిన పడకుండా దోమల వృద్ధి రేటును అరికట్టాలని అలా చేయాలంటే ముందుగా ప్రతి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెత్తాచెదారం లేకుండా పాడుబడిన ప్లాస్టిక్ డబ్బాలు డ్రమ్ములు కొబ్బరి బొండాలు డ్రింక్ సీసాలు వాటిలో నీరు నిల్వలు ఉండకుండా జాగ్రత్త చూసుకోవాలని ప్రతి నీరు నిల్వ ఉన్న పాత్రలపై మూతలు ఉంచాలని తద్వారా ఈ కీటక జనిత వ్యాధులను అరికట్ట వచ్చునని తెలిపారు.ఈ సందర్భంగా మలేరియా ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ మలేరియా మాసోత్సవాలు జూన్ 1 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరికి కీటక జనిత వ్యాధులు వలన మన శరీరానికి కలిగే ప్రాణాపాయం గురించి అవగాహన శిబిరాలు ర్యాలీ లు ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి బి. సత్యనారాయణ, పి. హెచ్ఎన్ఎం  రత్నసఖి ల్యాబ్ టెక్నీషియన్ కె.హరినాథ్ స్టాఫ్ నర్స్ అరుణ  స్థానిక సచివాలయం హెల్త్ సెక్రెటరీ రాజ్యలక్ష్మి ఇతర సిబ్బంది పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!