జూన్ 12 నాటికి నాడు నేడు పనులు పూర్తి చేయాలి : ఏపిఎం
ఈనెల జూన్ 12 నాటికి నాడు నేడు పనులు పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏపిఎం కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మహిళా సమైక్య కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జూన్ 12 నాటికి నాడు నేడు పనులు పూర్తి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేశామని ఆయన తెలిపారు. ప్యాపిలి మండలంలో 47 పాఠశాలల్లో ఫేస్ టు కింద ప్రస్తుతం నాడు నేడు పనులు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు, అదేవిధంగా 30 పాఠశాలలో మరుగుదొడ్లు పనులు, 24 పాఠశాలలో వంట గదులు, 30 పాఠశాలలో అదనపు గదులు ,28 పాఠశాలలో మరమతు పనులు, 30 పాఠశాలలో ఎలక్ట్రికల్ సంబంధించిన పనులు జరుగుతున్నట్లు,
ఫేస్ టు కింద నాడు నేడు పనులకు గాను 4కోట్ల 10 లక్షల 27 వేలు మంజూరు కాగా, అందులో 3 కోట్ల 4 లక్షల 12 వేలు నాడు నేడు పనులకు ఖర్చయినట్లు , 1 కోటి 6 లక్షల 15వేలు ఇంకా మిగిలినట్లు ఆయన తెలిపారు.
జూన్ 12 నాటికి పాఠశాలలు ప్రారంభం అయ్యేసరికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పనులు పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అలాగే జగనన్న విద్యా కానుక కిట్లు కూడా పంపిణీ చేయాలని అదులో ప్యాపిలి మండల విద్యార్థులకు గాను 5164 బెల్టు, బాలికలకు, బారులకు యూనిఫారము క్లాత్
గాను 7వేల66 మీటర్లు, ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు 37,902 టెస్ట్ పుస్తకాలు , అలాగే ఒకటో తరగతి ఆరో తరగతి విద్యార్థులకు 1296 డిక్షనరీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పంపిణీ చేయాలని ఆయన కోరారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..