గోడ పత్రిక ఆవిష్కరణ..

గోడ పత్రిక ఆవిష్కరణ..

ఎస్.రాయవరం. ఏప్రిల్ 27. అఖండ భూమి.

మండలంలోని తీరప్రాంతమైన రేవుపోలవరం గ్రామంలో మే 8 వ తారీఖున జరిగే గ్రామ దేవత బంగారమ్మతల్లి పండుగ మహోత్సవాల సందర్బంగా గురువారం నాడు ఎస్.రాయవరం ఎస్ ఐ ప్రసాదరావు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ పండుగ సందర్బంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ గోవింద్ తెలిపారు. ఈ సందర్బంగా స్థానిక ఎస్ ఐ ప్రసాదరావు మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడలు నిర్వహించడం, వాలీబాల్ పోటీల నిర్వహణకు గ్రామస్తులు ముందుకు రావడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో రేవు పోలవరం, కొత్త రేవుపోలవరం గ్రామస్తులు, టోర్నమెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!