రిషి జూనియర్ కాలేజ్ విద్యార్దులకు అభినందనలు
అభినందించిన ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ నర్సీపట్నం ఏప్రిల్ 27 అఖండ భూమి.
నర్సీపట్నం మున్సిపాలిటీ లో ఉన్న రిషి జూనియర్ కాలేజ్ విద్యార్దులు నిన్న విడుదల అయిన ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి అత్యధిక మార్కులు సాధించారు ఆ విద్యార్థులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమం లో రిషి కళాశాల కరస్పాండెంట్ కోన సతీష్ , డైరెక్టర్ నాయుడు మరియు అధ్యాపకబృందం పాల్గొన్నారు.



