అక్రమ మట్టి మాఫియా … నిండు ప్రాణం బలి…

 

 

డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం మండలం, నిన్న శుక్రవారం, నడిపూడి గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా..మట్టి ట్రాక్టర్ ఢీకొని పెనుమాల ప్రశాంతి (16) అనే ఒక విద్యార్థి అక్కడికి అక్కడే మరణించడం జరిగింది, మరో ఇద్దరు విద్యార్థుల కు గాయాలు అయ్యాయని, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారని మాల మహానాడు చీకురుమెల్లి రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు, ఈ అక్రమ మట్టి దందా అరికట్టాలని లేకుంటే ప్రజలు భయబ్రాంతులకు గిరి అయి..ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని రవికుమార్ జిల్లా కలెక్టర్ గారికి పది రోజుల క్రితం,పిర్యాదు చేసారని, అయినా జిల్లా కలెక్టర్ గారికి చీమ కొట్టినట్టు లేదని, తాసిల్దార్్ విఆర్వోలు  మైనింగ్ అధికారులతో కుమ్మక్కు అయి జేబులు నింపుకుంటున్నారని ఆయన మండిపడ్డారు, ప్రజా సంక్షేమం కోసం పనిచేయని జిల్లా కలెక్టర్ గారిని, లోకల్ తాసిల్దార్గా విఆర్ఓ వెంటనే సస్పెండ్ చేసి, విధులనుం డి తొలగించాలని రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా ఎంతమంది అమాయక ప్రజల చావుకు కారణం అవుతారని, ఇది ముమ్మాటికీ తాసిల్దార్ విఆర్ఓ జిల్లా కలెక్టర్  నిర్లక్ష్యంగా పరిగణించక తప్పదని మీడియా ముందు మండిపడ్డారు.

Akhand Bhoomi News

error: Content is protected !!