వేములపూడి లో వైసీపీ నుండి 30 కుటుంబాలు జనసేనలో చేరిక

 

నర్సీపట్నం మండలం వేముల పూడి లో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాజాన వీర సూర్య చంద్ర గ్రామస్తులను కలిసి జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను వివరిస్తూ పవన్ కళ్యాణ్ గొప్ప ప్రజా నాయకుడనీ తన స్వంత సొమ్మును ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల ఆదుకోవడం కోసం హెచ్చించిన నిస్వార్థ నాయకుడని రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం కల్పించాలంటూ కోరారు అలాగే గ్రామంలో పర్యటిస్తూ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు కానీ చొరవ తీసుకోకపోవడం అన్యాయమన్నారు గ్రామంలో అనధికారికంగా గ్రావెల్ దందా జరుగుతుందని అధికార వైసిపి నాయకులు అక్రమంగా గ్రావెల్ తవ్వుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగుతున్నారన్నారని తప్పుడు కేసులు పెడుతున్నారని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు గ్రావెల్ తవ్వకాల వల్ల రైతుల ఇళ్లలో దుమ్ము దూళి అధికంగా రావడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇప్పటికైనా గ్రావెల్ దందా కి పాల్పడుతున్న వారిపై మైనింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వేములపూడి నుంచి అన్నవరం వెళ్లే రహదారి శిధిలావస్థకు చేరుకుందని కల్వర్టు కూడా కూలిపోయే స్థితిలోకి వచ్చిందని చెప్పారు స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ లో అంతంత మాత్రంగానే వైద్య సేవలు అందుతున్నాయని తక్షణమే ఇక్కడ 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు ఈ వైసిపి ప్రభుత్వ హయాంలో వైసిపి నాయకులు దోచుకోవడం… దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమం సందర్భంగా గ్రామానికి చెందిన బంగారు అప్పలనాయుడు బోళెం గంగాధర్ ల ఆధ్వర్యంలో గుడివాడ సత్తిబాబు చందవాడ దుర్గాప్రసాద్ బండారు అశోక్ బోళెం పవన కుమార్ నెల్లి మణికంఠ అగ్రహారపు రాజేష్ సూర్యనారాయణ చూపురు సతీష్ బండారు చిన్న అశోక్ శ్రీశైలపు అశోక్ చింత అశోక్ చింతల తాతాజీలకు చెందిన 30 కుటుంబాలు పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరాయి ఈ మేరకు జనసేన పార్టీ నర్సీపట్నం ఇంఛార్జి వీర సూర్యచంద్ర పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్ గొలుగొండ మండల అధ్యక్షులు గెండం దొరబాబు వేగిశెట్టి శ్రీను వాసం వెంకటేష్ మాకిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!