క్రికెట్ విజేతలకు బహుమతులు అందించిన ఎం వి వి ప్రసాద్

 

క్రికెట్ విజేతలకు బహుమతులు అందించిన ఎం వి వి ప్రసాద్

కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ : –

జూన్ 4 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రేవళ్లు పంచాయతీలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జిసిసి చైర్మన్ రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎం వి వి ప్రసాద్ చేతుల మీదుగా ఆదివారం బహుమతులు ప్రధానం చేశారు ఈ సందర్భంగా ఎం వివి మాట్లాడుతూ యువకులు ఇలాంటి క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తి చూపించాలని ఆయన అన్నారు ఈ టోర్నమెంట్ లో 18 టీంలు పాల్గొనగా విన్నర్గా శాంతినగర్ పదివేల రూపాయలు రెండవ బహుమతిగా రేవళ్లు ఐదువేల రూపాయలు తో పాటు షీల్డ్ లు కూడా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటలక్ష్మి కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు టిడిపి నాయకులు అప్పలరాజు స్వామి అప్పన్న తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!