హైవే నిర్మాణంలో గిరిజన ప్రాంతం లూటీ …

హైవే నిర్మాణంలో గిరిజన ప్రాంతం లూటీ

గిరిజన బాలుడు మరణానికి గుత్తేదారు నిర్లక్ష్యమే కారణం

జాతీయ రహదారి నిర్మాణాలపై కలెక్టర్ మొనటిరింగ్ చెయ్యాలి

కనీస ప్రమాణాలు పాటించని గుత్తేదారు

బాలుడి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి

అఖండ భూమి: హుకుంపేట

మండలం హైవే నిర్మాణంలో గుత్తేదారు గిరిజన భౌగోళిక ఆస్తులను లూటీ చేస్తున్నారని గిరిజన సంఘం కార్యదర్శి కృష్ణారావు పత్రిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్ ఇసుక, రాయి, నీరు,అప్పనంగా వాడుకుంటున్నారని ఇసుక, రాయి, నీరు, సేకరించిన స్థానిక పంచాయతీలకు పన్ను చెల్లించాల్సి ఉంది కానీ కాంట్రాక్టర్ ఆదిశగా ఆలోచన చేసిన పాపన్న పోలేదు అందులో భాగంగానే రోడ్డుకి వాటరింగ్ చేయు నిమిత్తం ఏర్పాటు చేసుకున్న అనాధరేషన్ నీళ్ల ట్యాంకు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయడంలో అటుగా వెళ్లిన మజ్జి జ్ఞాన దీపక్ ఎండ తీవ్రత తట్టుకోలేక మాములు పొలాలే కదా అని అక్కడ మునిగి ప్రాణాలుకొల్పయాడు ఆ అమాయక పిల్లోడికి తెలీదు కదా డబ్బులు మిగులించుకోవడాని అక్కడ జె సి బీ తో కుంటలా చేసి నీళ్లు నిల్వ పెట్టారని పాపం పిల్లోడు గ్రహించ లేకపోయాడని విమర్శించారు .ప్రమాదం జరిగిన తరువాత హెచ్చరిక బోర్డ్ లు నిల్వ పెట్టిన నీళ్లను రోడ్ మధ్య లో కాలువ ల చేసి వదిలేశారు అదేదో అధికారులు చొరవ తీసుకొని ముందు జాగ్రత్తలు తెగిసుకొని ఉంటే తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదని ఆయన ఆవేదన చెందారు . అధికారులు ప్రతినిధులకు ఈ కుంట కనిపించక పోవడం అర్చర్యంగా ఉందన్నారు మృతికి గుత్తేదారు నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. ఈ విషయంపై గిరిజన సంఘం నాయకులు పిఓ దృష్టికి తీసుకు రావడంతో నీటిని దిగువ ప్రాంతానికి పంపించి చేతులు దులుపుకున్నారని అన్నారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో పాటించాల్సిన కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదన్నారు మట్టి, రాయి, ఇసుక, చిప్స్, లారీల పై లోడువేసి తగిలించినప్పుడు వాటిపై పరజాలు పేర్చల్సి ఉంది అలా చేయకపోవడంతో వాటి పై ఉన్న మెటీరియల్ రోడ్డు మీద పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని పాదచారులకు తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు ఏదైనా రోడ్డు కొత్తగా మల్లింపు చేసినప్పుడు రోడ్డు పై మట్టిపోసి రోలింగ్ చేసి వదిలేస్తున్నారే కేసర బుగ్గి గాని లేకుంటే ఏమైనా బురద , దూళి రవకుండా తగు చర్యలు తీసుకోవడం లేదు దీని కారణంగా చిన్న పాటి వర్షం పడిన అంత బురద మాయం అయిపోయి ప్రమాదాలలో చాలా ద్విచక్ర వాహనాదారులకు గాయాలు అయిన ఘడియలు కూడా వున్నాయి ఎండ కాస్తే దుమ్ము దులి వాహనదారులపై పడి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అటువంటి ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి ఇరువైపులా రేడియేషన్ స్టిక్కర్లు అంటించాల్సి ఉన్న తూతూ మంచంగా అమర్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు దృష్టి సరించలేదని ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు కలెక్టర్ పిఓ సబ్ కలెక్టర్ లు పర్యవేక్షించి తగు చర్యలు చేపట్టాలి మీరు అనధికార నీటి గుంటలో మునిగి మరణించిన బాలుడు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు

 

 

.

Akhand Bhoomi News

error: Content is protected !!