బైక్ యాక్షిడెంట్ లో గాయపడిన మాజీ సర్పంచ్ బలరాం కుమారుడు శోభా గెన్నును పరామర్శించిన:మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్
అల్లూరి జిల్లా: అరకు వెళ్లి/ గూడెం కొత్త వీధి అఖండ భూమి అరకు నియోజకవర్గం అరకువేలి మండలం బస్కి పంచాయతీ దేవరపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ శోభా బలరాం కుమారుడు శోభా గెన్ను బైక్ యాక్సిడెంట్ లో గాయపడుతూన్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇంచార్జి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ హుటాహుటిన దేవరపల్లి గ్రామానికి చేరుకుని శోభా గెన్ను పరిస్థితి చూసి జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది ఏ సమస్య ఉన్న తమకు తెలియజేయాలనీ దగ్గరుండి దైర్యం చెప్పి మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించి దైర్యం ఉండాలని మనో ధైర్యాన్ని నింపి ఏ ఇబ్బంది కలిగిన తక్షణమే తెలియజేయాలనీ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ వెంట మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు మాజీ వైస్ ఎంపీపీ పొద్దు అమ్మాన్న స్టేట్ తెలుగు యువత ఆర్గనైజేషన్ కార్యదర్శి కిళ్లో సాయిరాం మాజీ ఎంపీటీసీ మాణిక్యం టీడీపీ మహిళా నాయకురాలు కళావతి నీరజా టీడీపీ యువ నాయకులు చట్టు అప్పలరాజు,శ్యామ్,రమేష్ కామేష్,నగేష్ తదితరులు పాల్గొన్నారు


