రింతాడ సమీపన ఉన్న నల్లరాయి కొండపై మైనింగ్ మాఫియా కన్ను పడిందా..

రింతాడ సమీపన ఉన్న నల్లరాయి కొండపై మైనింగ్ మాఫియాకన్ను పడిందా..

క్వారీ తవ్వుతామంటే యుద్ధమే..

రింతాడ ఉపసర్పంచ్ మడపల సోమేష్ కుమార్

అల్లూరి జిల్లా: రింతాడ /గూడెం కొత్తవీధి, (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం రింతాడ గ్రామ సమీపన పెద్ద కొండను ఆనుకొని నల్లరాయి సుమారు 70 ఎకరాల విస్తీర్ణంకు పైగా అటవీ శాఖ పరిధిలో ఉందని, రంగురాళ్లకు,విలువైన ఖనిజ సంపదకు ఇది ప్రసిద్ధిగాంచిందని, మైనింగ్ మాఫియా గుట్టు చప్పుడు కాకుండా ఆ నల్ల రాయి త్రవ్వకాలు జరుపుటకు నల్ల రాయికి చుట్టుపక్కల ఉన్న భూ హక్కుదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇప్పటికే కొందరి స్థానికులకు డబ్బులు ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయని రింతాడ పంచాయతీ ఉపసర్పంచ్ ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి మండల కమిటీ కోశాధికారి మడతల సోమేశ్ కుమార్ మీడియాకు తెలిపారు. ప్రజల్లో వస్తున్న ఊహగానాల్లో ఎంత వరకు నిజం దాగి ఉందో తెలియదు గానీ ప్రజల్లో వస్తున్న విశ్వాసనీయ ఊహగానాలు నిజమైతే, ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న రంగురాళ్లు, విలువైన ఖనిజ సంపదపై మైనింగ్ మాఫియా కన్ను పడినట్లేనని ఆయన అన్నారు.ఈ ప్రాంతంలో

తవ్వకాలు చేపడితే 10 కిలోమీటర్ల వరకు చుట్టుపక్క ఉన్న గ్రామాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు.దీనివల్ల త్రాగునీరు సాగునీరు కలుషితమవుతుందని ఆ తర్వాత నీటి ఇబ్బందులు తప్పవని అన్నారు. కాలుష్యంతో పంటలు దిగుబడి తగ్గిపోతుంది,అటవీ ఫల సాయం ఇక అందే పరిస్థితి ఉండదు.రైతులు సాగు చేసుకుంటున్నా కాఫీ తోటలు, వ్యవసాయ పంటలపై ఆ ధూళి పడి కాలుష్యం వల్ల పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని అన్నారు.దీనివల్ల రైతులు ఎప్పటికైనా ఆ భూములు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. క్వారీ వలన అడవులపై ఆధారపడి ఉన్న అటవీ జంతువులకు ముప్పు తప్పదు.క్వారీ ధూళి వలన కాలుష్యం పెరిగి గ్రామ ప్రజలకు ప్రాణహాని తప్పదు అన్నారు. ప్రజల జీవితాలపై పర్యావరణం పై ప్రభావం చూపించే ఇలాంటి క్వారీ తవ్వకాలకు పంచాయతీ తీర్మానాలు, పిసా తీర్మానాలు, అనుమతులు ఇవ్వకూడదని గ్రామస్తులు మరియు ఆయన డిమాండ్ చేశారు. గ్రామానికి ఆనుకొని ఉన్న నల్ల రాయి తవ్వుతామంటే యుద్ధమే చేస్తామని,ఆ యుద్ధంలో గెలుస్తామని ఎట్టి పరిస్థితుల్లో క్వారీ తవ్వకాలకు అనుమతించేది లేదని మడపల సోమేష్ అన్నారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో తవ్వకాలు జరగాలన్న, నిర్మాణాలు చేయాలన్న పిసా చట్ట ప్రకారం గ్రామసభ ఆమోదం ఉండాలని, పంచాయతీ తీర్మానాలు ఉండాలని నల్లరాయి క్వారీ తవ్వకాలకు వ్యతిరేకంగా ఎటువంటి తీర్మానాలు జరగకుండా అడ్డుకుంటామని మండల జేఏసీ కోశాధికారి, రింతాడ ఉపసర్పంచ్ మడపల సోమేశ్ కుమార్ మీడియాతో అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!