పూర్వపు విద్యార్థుల కలయిక…..
కోటనందూరు అఖండ భూమి వెబ్ న్యూస్ : –
స్థానిక మండలంలో స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో1993–94 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. మూడు దశాబ్దాల తర్వాత ఒకే చోట కలుసుకొని ఒకరికి ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని సందడి చేశారు. వివిధ రంగాల్లో స్థిరపడిన విద్యార్థులంతా వ్యక్తిగత జీవితాలతో పాటు అలనాటి జ్ఞాపకాలను చెప్పుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. కష్టసుఖాలు మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు. అనంతరం ఆనాడు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఘనంగా సత్కరించారు.



