అధికార పార్టీ తిన్నదికక్కిస్తాం, పేదల కు పంపిణీ చేస్తాంనల్లమిల్లి
బిక్కవోలు. అఖండ భూమి వెబ్ న్యూస్
బిక్కవోలు మండలం కొమరిపాలెంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మేనిపెస్టో ను మహానాడు వేదీకగా అన్నదాత పథకం పేరుతో ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20,000/- ఆర్ధిక సహాయం ప్రకటించిన సందర్బంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి ధాన్యంతో అభిషేకం చేయడం జరిగింది.
అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ
ఈ రోజు ఎరువాక పౌర్ణమి, ఎరువాక పౌర్ణమి అంటే రైతులు కళకళలాడుతూ దుక్కు దున్నీ సేద్యానికి అంకురార్పణ చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ఇటీవల కాలంలో ధ్యానం కొనుగోలు ప్రక్రియ ఎంత ప్రహసనoగా మారిందో మనం చూసాం. మద్దతు ధర ప్రకటించమన్నారు. ధాన్యం కొనుగోలు ప్రారంభించమన్నారు.రైస్ మిల్లర్లు అందిన కాడికి దండుకున్నారు మద్దతు ధర దక్కుతుంది అని రైతాంగం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ధాన్యం అమ్ముదామని మద్దతు ధర లభిస్తుందని రైస్ మిల్లులు దగ్గరకు ధాన్యం తీసుకువెళ్ళితే 5కేజీ ల తరుగు,4కేజీల తరుగు,10కేజీల తరుగు అంటూ ఒక బస్తాకు రూ.400-500/- తగ్గించిన వైనం మనం చూసాం. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ దానిపైన మాట్లాడిన దాఖలాలు లేవు, చివరికి రైతులను అయిన కాడికి అమ్ముకొనే పరిస్థితి తీసుకువచ్చారు.
ప్రభుత్వం ఎన్ని క్విoటాల ధాన్యం కొన్నది ఎంత కొన్నది అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.తన బాధ్యత ల నుండి ప్రభుత్వం తప్పించుకుని ధ్యానం కొనుగోలు ఒక ప్రహాసనంగా మార్చింది. ఇసుకను ఏ విధంగా కేంద్రీకృతం చేశారో, మద్యాన్ని ఏ విధంగా కేంద్రీకృతం చేసి దోచుకుoటున్నారో అదే విధంగా ఒక ప్రహాసనంగా మార్చి స్థానిక ప్రజా ప్రతినిధి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ దోచుకుని జలగల లాగా పీల్చుకు తింటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైతు నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా నష్టపోయిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు అధికారం లో ఉన్నప్పుడు ఎరువాక పౌర్ణమి పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి ముందుగానే సాగునీరు అందించి రైతుల వ్యవసాయానికి అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగేది. ఎరువులు పురుగు మందులు కూడా సబ్సిడీ ఇచ్చి ఆదుకోవడం జరిగేది.
ఇవ్వాల్టీ వరకు కాలువలకు నీరు ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. నామమాత్రంగా I.A.B మీటింగ్ పెట్టారు. ఒకటో తారీఖున నీరు విడుదల చేస్తామని చెప్పారు ఎక్కడ చూసిన తూడు పెరిగిపోయి కాలువలు కానీ మురుగు కాలువలు కానీ పూడిక పెరిగిపోయి నీరు ఏ విధంగా ప్రవహిస్తుంది, నీరు ఏ విధంగా అందుతుందో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నాo. ఇటువంటి పరిస్థితి లో రైతుకు చేయూతనివ్వాలి అటు భూయజమానితో పాటు కౌలు రైతుకు కూడా ఇవ్వాలి.
వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని రైతుకు అన్ని విధాలుగా చేయూత నివ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈవేళ ఒక మినీ మేనిఫెస్టోను మొన్న మహానాడు సందర్బంగా రాజమహేంద్రవరం లో ప్రకటిoచడం జరిగింది. దానిలో రైతులకు ప్రతి రైతుకు ఆర్ధిక సహాయం అందిస్తాం.రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతా ఉందొ దానికి తోడుగా అదనంగా రూ.20,000/- ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది.
అదే కాకుండా కౌలు రైతులకు ఏ విధంగా మేలు చేయాలి ఇప్పుడు జరుగుతున్న రైతాoగానికి ఏ విధంగా మేలు చేయాలి.కౌలు రైతుకు ఏ విధానం మేలు చేయాలి అనే విధంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. రైతుకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు విజయదశమికి ప్రకటించడం జరుగుతుంది.రైతంగానికి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఈ సందర్బంగా తెలియచేసారు.
ఈవేళ ఎరువాక పౌర్ణమి సందర్బంగా ఇక్కడ బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో రైతులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకు రూ.20,000/- అందిస్తామని ప్రకటించిన సందర్బంగా రైతులు కృతజ్ఞతలు తెలియచేస్తూ చంద్రబాబు నాయుడు గారి చిత్ర పటానికి ధాన్యంతో అభిషేకం చేస్తూ వారి హర్షాన్ని, సంఘీభావం తెలియచేయడం జరిగింది. వాళ్ళoదరికి ఈ సందర్బంగా కృతజ్ఞతల తెలియచేస్తూన్నాం
వైస్సార్సీపీ పేటియం బ్యాచ్ కు మేము హెచ్చరిక జారీ చేస్తుంది ఒక్కటే ఈవేళ వాళ్ళు చెబుతుంది ఇవ్వని ఎలా అమలు చేస్తారని మాట్లాడుతున్నారు.ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 లక్షల కోట్లు అప్పు చేశారు.జగన్మోహన్ రెడ్డి సంక్షేమనికి 2లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు.మిగిలిన 9 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయాయి జగన్ ప్రభుత్వంలో ఆ నిధులన్నిటిని మెక్కడo జరిగింది, మీరు బోక్కింది కక్కించడం జరుగుతుంది, ఆ నిధులను పేదలకు,యువతకు మహిళలకు,రైతులకు పంపిణి చేస్తాం.అదే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అని ఈ సందర్బంగా తెలియచేస్తూ, ఈవేళ నియోజకవర్గ స్థాయి నాయకుల దగ్గర నుంచి, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి స్థాయి వరకు తీవ్రమైన అవినీతికి పాల్పడారు. వీళ్ళందరిని విచారణ చేస్తాం, వీళ్ళందరూ తిన్నది అంతా కక్కిస్తాo దానిని పేద ప్రజలకు పంపిణి చేస్తాం.
చంద్రబాబు నాయుడు గారికి సంపదను ఏ విధంగా సృష్టించాలి అనేది వెన్నతో పెట్టిన విద్య ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీని ఉపయోగించుకుని పరిశ్రమలు రప్పించి సంపద సృష్టిస్తాం తద్వారా సంక్షేమ కార్యక్రమాలే కాదు, సంక్షేమాన్ని అభివృద్ధిని మేళవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూరోగతిలోకి తీసుకురావడం ఖాయమని ఈ సందర్బంగా వైస్సార్సీపీ నాయకులు తెలియచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాలరెడ్డి,రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి ఆదినారాయణరెడ్డి,రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి,తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవదానబాబా,వైస్ ప్రెసిడెంట్ వెంకటరామారెడ్డి,వెంకటరెడ్డి,వైస్ ప్రెసిడెంట్ తాతారెడ్డి, వీరభద్రరెడ్డి, కలెక్టర్,త్రిమూర్తులు, డాక్టర్ శ్రీను,అప్పారావు, శ్రీను, కుమార్,మోహన్,రాజేష్,సత్యనారాయణ,సూరిబాబు,అబ్రహం,వెంకటేశ్వరరెడ్డి,శ్రీనివాసరావు, సత్యనారాయణ రెడ్డి, వెంకన్న, రాజు, సత్తిరాజు, చంటిబాబు,మండల &గ్రామ నాయకులు పాల్గోన్నారు
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



