రైతులకు రాయితీపై నాసిరకం వేరుశనగ బుడ్డల ను పంపిణీ చేసిన అధికారుల
ఆందోళన చెందుతున్న రైతులు
తుగ్గలి జూన్ 4 అఖండ భూమి వెబ్ న్యూస్ : –
మండలంలోని రైతుల కు ఖరీఫ్ లో వేరుశనగ పంట సాగు చేసేందుకు ప్రభుత్వము రాయితీ పై వేరుశనగ బుడ్డలను పంపిణీ చేశారు. అయితే చాలా గ్రామాల లో రైతులకు నాసిరకం బుడ్డలను పంపిణీ చేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పగిడిరాయి కొత్తూరు గ్రామానికి చెందిన దాదాపు పది మంది రైతుల కు నాణ్యతలేని వేరుశనగ బుడ్డలను అధికారులు పంపిణీ చేయడం జరిగింది. దీంతో ఆ రైతులు ఈ బుడ్డల ను ఎలా పొలాల్లో విత్తాలి అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు చక్రపాణి మాట్లాడుతూ గ్రామంలో తన తో పాటు మరో పదిమంది రైతులు రాయితీ పై ప్రభుత్వం నుండి వేరుశెనగ బిడ్డలను తీసుకోవడం జరిగిందన్నారు. ఈ బుడ్డలన్నీ పూర్తిగా నాశరకంగా ఉన్నాయని ఆయన ఆవేదన చెందారు .అందువల్ల జిల్లా అధికారులు స్పందించి నాసిరకంగా బుడ్డలు పంపిణీ చేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకొని, రైతులకు నాణ్యమైన వేరుశనగ బుడ్డలను ఇవ్వాలన్నారు. లేకపోతే తాసిల్దార్ కార్యాలయం వద్ద రైతుల తో కలిసి ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు.



