వైయస్సార్ బీమా పథకమును ప్రతి ఒక్కరు నమోదు చేసుకోండి.

 

 

వైయస్సార్ బీమా పథకమును ప్రతి ఒక్కరు నమోదు చేసుకోండి.

డోన్ జూన్ 5 (అఖండ భూమి) : నియోజకవర్గ పరిధిలోని, డోన్, బేతంచెర్ల, ప్యాపిలి, మండలంలోనిఅన్ని గ్రామాల ప్రజానీకానికి తెలియజేయడమేమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత వైయస్సార్ బీమా పథకం ఈనెల 7 వ తేదీవరకు లబ్ధిదారుల నమోదు ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డోన్ నియోజవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్టీ ఈ దినేష్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ రెండు రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు మీ సమీపంలో ఉండే సచివాలయం పరిధిలో మీ కుటుంబంలోని పెద్దల పేరు మీద ఉచిత బీమాను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు . నియోజక వర్గంలోని ప్రతి వాలంటీర్లు మీ క్లస్టర్ లోని ప్రతి ఒక్క లబ్ధిదారులకు వైయస్సార్ భీమా నమోదు చేయించే విధంగా చూడాలని ఆదేశించారు. వైయస్సార్భీ మా పథకంలో నమోదైన కుటుంబంలో కుటుంబ పెద్ద సహజ మరణం పొందితే ఒకలక్ష రూపాయల భీమా నగదు మరియు ప్రమాదవశాత్తు చనిపోవడం గాని లేక శాశ్వతఅంగవైకల్యం బారిన పడిన కుటుంబ పెద్దకు 5 లక్షల నగదును ప్రభుత్వం అందిస్తుందనితెలిపారు. కావున 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న ప్రతికుటుంబ పెద్దలు ఉచిత వైఎస్ఆర్ బీమా పథకంలో తప్పకుండా తమ పేరును నమోదుచేసుకోవాలని , ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నాయకులు,సర్పంచులు , ఎంపీటీసీలు , కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు, ప్రజలుస్వచ్ఛందంగా ఉచిత భీమా నమోదు ప్రక్రియలో పాల్గొని ప్రతి లబ్ధిదారులకి అవగాహనకల్పిస్తూ పథకం అందేలా చూడాలని కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!