ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా గ్రామ స్వరాజ్యసమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

 

 

ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా గ్రామ స్వరాజ్యసమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

కొయ్యూరు అఖండ భూమి అల్లూరు జిల్లా వెబ్ న్యూస్ :

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గ్రామ స్వరాజ్యసమితి ఆధ్వర్యంలో నడింపాలెం ,శరభన్నపాలెం ఎర్ర కొండమ్మ ఆలయం వద్ద మొక్కలు నాటారు ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్యసమితి ప్రతినిధుల ఆలయం ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్ధాలను గ్రామ యువత ఆధ్వర్యంలో శుభ్రం చేశారు అనంతరం పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను మరియు ప్లాస్టిక్ వినియోగంపై వచ్చే అనర్ధాలను యువతకు తెలియజేయడం జరిగింది అనంతరం పర్యావరణ పరిరక్షణ కొరకు బాదం గానుగ ఉసిరి మొక్కలను ఎర్రగొండ గుడి ఆవరణలో నాటారు అంతేకాకుండా ఈ మొక్కల పరిరక్షణకు గ్రామ స్వరాజ్యసమితి బాధ్యత తీసుకున్నట్లు ప్రతినిధులు డివై నాయుడు తెలియజేశారు పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి సమతుల్యలకు భూతాపం తగ్గించుటకు మొక్కలను పెంచడం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ఒకటే మార్గం అని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ స్వరాజ్యసమితి ప్రతినిధులు శంకర్ గణేష్ రోజు రమ్య సత్యనారాయణ లోవరాజు నగేష్ రమేషు రామ్మూర్తి గ్రామ యువత పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!