కరెంట్ కోతల వల్ల ప్రజలు ఇబ్బందులు. తాళ్ళరేవు
(అఖండ భూమి) తాళ్లరేవు ఓవైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు కరెంటు కోతలు, లో వోల్టేజ్ తోడవ్వడంతో జనం బెంబేలెత్తుతున్నారు ఇంట్లో ఉండోలేక బయటికి రాలేక సత-మతమవుతున్నారు. రాత్రిపూట సైతం విద్యుత్ కోతలు,లోవోల్టేజీ ఉండటంతో నిద్ర కరువవుతున్నది జనరేటర్, ఇన్వర్టర్, టార్చిలైట్ వెలుతురులో గడపాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. ఇలా పరిస్ధితులు నెలకొన్నాయంటే తాళ్లరేవు మండలం గాడిమొగ ప్రజలు పవర్ ఏ మేరకు ఉందో గ్రహించవచ్చు.
ఇక తాళ్లరేవు పరిసర ప్రాంతాలలో అయితే చెప్పనవసరం లేదు అనధికార కోతలతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కట్లు అంతా ఇంతకావు ఈ కరెంటు కష్టాలకు కారణమేంటి అని పరిశీలిస్తే వాస్తవంగా మనకి అందుబాటులో ఉన్న అన్ని విధానాలు అమలు చేస్తామనన్నారు కానీ
ఏమి చేయడం లేదని తాళ్లరేవు మండల ప్రజలు విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తున్నారు.



