గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎమ్మెల్యే విఫలం జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర

 

నాతవరం మండల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ ఘోరంగా విఫలమయ్యారని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆరోపించారు పెదగొలుగొండపేట గ్రామంలో నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ ఆధ్వర్యంలో జనసేనపార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడంతో పాటు గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడం కోసం సూర్యచంద్రను వలయంలా చుట్టు ముట్టారు వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలను గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఎన్నో సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తున్నారన్నారు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని అన్నారు గడపగడపకు వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేకు ఇవేమి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు  ప్రజా సమస్యలను ఇప్పుడు పట్టించుకోకపోతే రేపు ఎలక్షన్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు   పెదగొలుగొండపేట గ్రామంలో వాటర్ ట్యాంక్ లేక ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండటంలో కాలువ లోని మురుగునీరు రోడ్లపై పారుతుందన్నారు మండలంలోని నాతవరం గునుపూడి శృంగవరం పశువైద్యశాలలు ఉన్నప్పటికీ వైద్యులు ఎవరూ అందుబాటులో లేక పశువైద్య సేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయని దీంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు నాతవరంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన ప్రభంజనం సృష్టించడం ఖాయమని రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇచ్చి మన భావితరాలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వేగిశెట్టి శ్రీను పాలుపర్తి సూరిబాబు మాకిరెడ్డి వెంకటరమణ అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!