విద్యుత్ చార్జీల పేరుతో బాదుడు తగదు

 

విద్యుత్ చార్జీల పేరుతో బాదుడు తగదువిద్యుత్ చార్జీల పేరుతో బాదుడు తగదు

పేదలు, సామాన్యులపై మోయలేని భారం

తక్షణమే వెనక్కు తీసుకోవాలి

విలేకర్ల సమావేశంలో సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పేరుతో పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నదని, సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, తక్షణమే విద్యుత్ భారాలను వెనక్కి తీసుకోవాలని సిపిఐ(యంయల్) ఆర్ ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గురువారం నాడు కర్నూలు నగరంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ

రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విద్యుత్ చార్జీల అదనపు భారం మోపబోమని గత సంవత్సరం ఏపీఈఆర్సీ ద్వారా ప్రకటన చేయించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రస్తుతం జూన్ నెలలో విడుదల చేసిన కరెంటు బిల్లుల ద్వారా సామాన్య ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రూ అప్ చార్జీలను ఉపసంహరించుకోవాలని సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టీ అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేదని ఆయన అన్నారు.

ప్రస్తుత బిల్లులో ఫిక్స్డ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ట్రూ అప్ చార్జీలు, ఎఫ్పీపిసిఏ ఇలా రకరకాల పేరుతో అదనపు చార్జీల భారం వేశారన్నారు.

విద్యుత్ బిల్లులో కనీస వినియోగ చార్జీలు 270 రూపాయలు అయితే రకరకాల భారాలు కలిపి 556 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజానీకం ఇబ్బందులు గమనంలో ఉంచుకొని తక్షణమే విద్యుత్ బిల్లులో విధించిన అదనపు చార్జీల వసూలును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీల భారాన్ని ప్రస్తావిస్తూ బాదుడే బాదుడు అంటూ ప్రజానీకాన్ని గుర్తు చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుతం వేసిన అదనపు భారాలను వెనక్కు తీసుకునేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో సిపిఐ (యంయల్) ఆర్ ఐ ఆధ్వర్యంలో ప్రజానీకాన్ని కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

ఈ సమావేశంలో సిపిఐ (యంయల్)ఆర్ ఐ పార్టీ నాయకులు కలాంబాష AIRSO జిల్లా కార్యదర్శి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!