ఘనంగా ముగిసిన వేసవి శిక్షణ శిబిరం

 

ఘనంగా ముగిసిన వేసవి శిక్షణ శిబిరం

-బాలలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేత

భీమవరం టౌన్ జూన్ 11, అఖండభూమి.

భీమవరం వైఎస్సార్ శాఖ గ్రంథాలయంలో గత 34 రోజులుగా జరుగుతున్న వేసవి శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిశాయి. డిఈవో అర్ వెంకట రమణ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో బాలలు బయట తిరగకుండా ప్రభుత్వం విజ్ఞాన వేసవి శిబిరాలను నిర్వహిస్తుందని, భీమవరం గ్రంధాలయంలో 126 మంది బాలలకు శిక్షణ నిర్వహించారని అన్నారు. ముగింపు కార్యక్రమాలలో బాలలను ప్రోత్సహిస్తూ పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను, ప్రశంసా పత్రాలను అందివ్వడం గొప్ప విశేషమని అన్నారు. రీడర్స్ ఫోరమ్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రమణ్యం, కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, గ్రంధాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శిక్షణ శిబిరంలో పాల్గొన్న 126 మంది బాల బాలికలకు అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సభ్యుల సహకారంతో మెమోంట్స్, ప్రశంసా పత్రాలు అందించామని తెలిపారు. కార్యక్రమంలో కలిగొట్ల గోపాల శర్మ, డి నాగేశ్వరరావు, డి శ్యామల పి పద్మ, బి శ్యామల, భవానీ శీతల్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!