ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్.

 

ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్.

యానం అఖండ భూమి వెబ్ న్యూస్ :

9.6.23 న యానాం మహాత్మా గాంధీ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం చిల్డ్రన్ ఆడిటోరియం లో యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్

ఆధ్వర్యంలో స్థానిక ఓఎన్జిసి సంస్థ ద్వారా నిర్వహించిన

ఉచిత హెల్త్ మెగా క్యాంప్ లో భాగంగా సుమారు 55 మందికి పైగా కంటి ఆపరేషన్ నిమిత్తం రాజమహేంద్రవరం పరమహంస యోగానంద నేత్రాలయ పౌండేషన్ కి పంపించిన విశయం పాఠకులకు విదితమే, అందరికీ ఆపరేషన్ పూర్తి

చేసుకొని ఆదివారం తమ ఇంటికి హాస్పిటల్ యాజమాన్యం వారు సురక్షితంగా చేర్చడం జరిగిందని ఫౌండేషన్ యాజమన్యం తెలపడం జరిగింది. ఈ మెగా హెల్త్ క్యాంపు నాలుగు విడతలుగా నిర్వహించడం జరిగిందనీ సుమారు 1500 మందికి పైగా హెల్త్ చెకప్ మరియు కంటి పరీక్షలు నిర్వించడం జరిగిందని అందులో భాగంగా 120 మందికి కంటి ఆపరేషన్స్ విజయవంతంగా చేయడం జరిగందన్నారు, మరియు 850 పైగా కళ్ళజోడ్లు ఉచితంగా పంపిణీ చేశారన్నారు

ఈరోజుల్లో సామాన్య ప్రజలు ఆపరేషన్ చేయించుకోవాలంటే వేలల్లో రూపాయలు ఖర్చు అవుతుందని ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే ఇలాంటి ఎమ్మెల్యేని గత 30 సంవత్సరాలుగా చూడలేదని ఎమ్మెల్యే అశోక్ చొరవతో ఉచితంగా ఆపరేషన్ చేయించుకునే అవకాశం కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని యానం మరియు పరిసర ప్రాంత ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ప్రాంత విభేదాలు లేకుండా , రాజకీయ పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందేలా చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ కి పలువురు నేతలు అభినందించారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు పేద ప్రజలకి అందించాలని కోరడం జరిగింది.

పేద ప్రజలకి నేను ఎల్లపుడు అండగా ఉంటానని ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ఓ ప్రకటన పేర్కొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!