కుసుమ జగదీష్ అకాల మరణం దురదృష్టకరం: ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ములుగు జిల్లా, అఖండ భూమి ప్రతినిధి ,జూన్ 11
హన్మకొండ హాజర హాస్పటల్ లో గుండె పోటు తో మరణించిన జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ స్వగ్రామం ములుగు మండలం మల్లం పెల్లి గ్రామములో పార్థివ దేహానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నివాళులర్పించడం జరిగినది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ములుగు జిల్లా అభివృద్ధి కోసం పని చేసిన జగదీష్ మరణం ములుగు జిల్లా ప్రజలకు మాకు తీరని లోటని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని సీతక్క అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఫిషర్ మెన్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ రవి,
మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ములుగు ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి
జిల్లా నాయకులు ల్యద శ్యామ్ రావు,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి తో పాటు గ్రామ కమిటీ అధ్యక్షులు మండల జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..